
జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మ నగర్ లో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వీరిద్దరూ ఇంటినుండి బయలుదేరి వరద కాలువ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం వరద కాలువ లో వీరి మృతదేహాలను గుర్తించారు. తల్లి వనజ 28, కుమార్తె శాన్వి 6 గా నిర్ధారించారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.