
ఢిల్లీ: దేశంలో కరోనా వేరియంట్స్ ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. దేశంలో ఒక మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా 2,82,970 మందికి పాజిటివ్ గా తేలింది. రోజు రోజుకి కరోనా కేసులు వృద్ధి రేటు పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో 441 మంది ఈ వైరస్ల కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ వైరస్ ఇప్పటివరకు 3కోట్ల 79 లక్షలు మందికి వచ్చినట్టుగా, 4,87,202 మంది ఇది మరణించినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు తప్పక వాడి తగు దూరం పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది.