
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 100 దాటితే, గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగి సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ఈ సారి ఏకంగా 25.50 రూపాయలు పెరిగింది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై 25.50 రూపాయలు పెరగగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 84 రూపాయలు పెరిగింది.
ఆయిల్ కంపెనీలు ప్రతినెల ఒకటో తేదీన ఈ ధరలను సవరిస్తాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగొచ్చు తగ్గొచ్చు.
పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రాలలో ఎంత ధర ఉందో చూద్దాం. హైదరాబాద్ 887 రూపాయలు, ఢిల్లీలో 834.50 రూపాయలు, కోల్కతా లో 861 రూపాయలు, ముంబైలో 834.50 రూపాయలు, చెన్నైలో 850 రూపాయలు చేరుకుంది.