
హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే వీకెండ్ పార్టీలు వేలల్లో జీతాలు ఇలా అనుకుంటారు చాలామంది. అయితే లక్షల రూపాయలు వస్తాయని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి నెల చివరి వరకు ఖర్చులకోసం తెలిసిన వారినీ స్నేహితులను అడిగేవారు ఉంటారు. ఇదే కోవలోకి ఆ యువకుడు కూడా వస్తాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకకు చెందిన అవినాష్ ఖర్గే (26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ శివారులోని శివరాంపల్లి కి వచ్చి స్థిరపడ్డారు. మొత్తం కుటుంబ సభ్యులు ఐదు మంది కలిసి అవినాష్ అక్కడే ఉంటున్నాడు. కొడుకు స్థిరపడడంతో తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూసి ఈనెల 26 పెళ్లి నిశ్చయం చేశారు. అయితే అవినాష్ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి సుమారు 15 లక్షల వరకు లోను తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాటి EMI లు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంక్ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు దీంతో మనస్తాపానికి గురైన అవినాష్ ఈ విషయాన్ని తన అన్నకు చెప్పుకొని బాధపడ్డాడు ముందు పెళ్లి చేసుకో తర్వాత లోన్ల గురించి తర్వాత మాట్లాడదామని అన్నదమ్ములు చెప్పారు. కుటుంబ సభ్యులందరూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైనారు కాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అతడిని గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.