
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన బీరయ్య రేణుక భార్య భర్తలు. భర్త పేరు మీద ఉన్న ఆస్తి పై రేణుక తన పేరు మీద అ మార్చుకునేందుకు ఒక పథకం వేసింది. తన భర్త చనిపోయాడు అని డెత్ సర్టిఫికెట్ పుట్టించింది. ఈ సర్టిఫికెట్ తీసుకొని స్థానిక తహసిల్దార్ ఆఫీసుకు వెళ్ళగా తాసిల్దార్ గారికి అనుమానం రావడంతో ఈ వ్యవహారం బయటపడింది.
. రేణుక తన భర్త బీరయ్య చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ తయారుచేసింది ఈ నకిలీ ధ్రువీకరణ పత్రం అందరికీ తెలుస్తుంది అనుకుందో ఏమో ఏకంగా పంచాయతీ సెక్రెటరీ సంతకం కూడా ఫోర్జరీ చేసింది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, స్థానిక మీ సేవా కేంద్ర నిర్వాహకుడి తో చేతులు కలిపి ఈ డెత్ సర్టిఫికెట్ ఫోర్జరీ చేశారు. ఈ డెత్ సర్టిఫికెట్ ను తెలకపల్లి తాసిల్దార్ కార్యాలయంలో మూడు నెలల కిందట 1.20 ఎకరాల భూమిని రేణుక పేరుమీద మార్ఫింగ్ చేశారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో తహసిల్దార్ గారికి అనుమానం రావడంతో విచారణ జరిపించగా బీరయ్య బతికే ఉన్నాడని తెలియడంతో పాటు ఆదర్శ సర్టిఫికెట్ పై ఉన్న పంచాయతీ కార్యదర్శి సందీప్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు తేలడంతో ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహా పతివ్రత తో పాటు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.