
తంజావూర్: సెలాదురై పట్టుకోటై లెత్సతోపు ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఇందుమతి తంబి కోట కీలక్కాడ ప్రాంతంలో నివాసం ఉండేది. వీరిరువురు ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి 9 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కలిగిన తరువాత పెద్దల తో కలిసి పోయారు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. వీరిరువురు పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇందుమతి పనికి వెళ్లే చోట ఒక యువకుడితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధం వరకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను మంచిగా హెచ్చరించాడు. ఆ యువకుడిని చితక బాది తన భార్యతో మాట్లాడవద్దని కలవద్దని హెచ్చరించారు. ఇందుమతి మాత్రం పద్ధతి మార్చుకోక పోగా తన సంతోషానికి అడ్డు తగులుతున్నాడు అని దీపావళి మరుసటి రోజు ప్రియుడితో కలిసి పారిపోయింది. పారిపోయిన ఈ జంట సేలం జిల్లాలో కాపురం పెట్టారు. రెండు నెలలపాటు ఇందుమతి భర్త వెతకగా వీరిరువురు దొరికారు. ఇందుమతి ని ఇంటికి తీసుకు తీసుకువచ్చారు. అప్పటినుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఇదే సమయంలో 4 రోజుల క్రితం ఆమె అక్క వేలంగని సమీపంలో నివాసం ఉంటున్న సెల్వీ బావ శంకర్ ఇంటికి వెళ్ళింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఫుల్లుగా తాగి, తన భార్య ఉన్నా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సమయంలో మాట మాట పెరిగి కోపోద్రిక్తుడైన సెల్లాడురై ఇందుమతి ని బయటకు పిలుచుకుని వచ్చి పెద్ద బండరాయినీ తలపై వేసి చంపేశాడు పోలీసులు వెళ్ళేవరకు శవం పక్కనే కూర్చున్నాడు.