
ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సిఐ శ్రీను, ఎస్ఐ సుధాకర్ లు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ కు చెందిన కిషోర్ (32), అదే గ్రామానికి చెందిన నిషిత అలియాస్ హన్విత (28) లు 2018లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కట్నంగా రెండు లక్షల రూపాయలు ఇస్తానని నిషిత తల్లిదండ్రులు వివాహ సమయంలో ఒప్పుకొని పెళ్లిలో లక్ష నగదు లాంఛనాలు గా ఇచ్చారు. మిగిలిన లక్ష కొరకై భార్య ను కొట్టి వేధించేవాడు. ఈ నేపథ్యంలో పెద్ద మనుషులు ఈ నెల 21వ తేదీన ఇద్దరి మధ్య రాజీ చేశారు. సోమవారం రాత్రి కూతురును తన తల్లిదండ్రులు ఇంట్లో పడుకోబెట్టి మంగళవారం ఉదయం తెల్లవారుజామున నిద్రపోతున్న తన భార్య మెడకు నైలాన్ తాడు బిగించి చంపి ఆమె ఉరి వేసుకున్నట్లు గా చిత్రీకరించాడు. ముసలి తల్లిదండ్రుల ఫిర్యాదు తో కిషోర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం వెలుగు చూసింది.