
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈరోజు ఆత్మకూరు లోని వ్యాపారస్తులు ఆర్డిఓ గారిని కలవగా వారు చర్చించి నియోజకవర్గంలోని 10 మండలాలకు లాక్ డౌన్ విధించారు. అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణదారులు వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అయితే మెడికల్ షాప్ లు మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు.
రేపటి నుంచి లాక్ డౌన్ విధించే మండలాలు :-
ఆత్మకూరు, ఏఎస్ పేట, వింజమూరు, ఉదయగిరి, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు, సంగం, చేజర్ల, సీతారాంపురం. ఆంక్షలు ఈ మండలాల వారీగా విధించడం జరిగింది.
కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు జాగ్రత్త లో భాగంగా ఈ లాక్ డౌన్ విధించడం జరిగింది అని ఆర్ డి ఓ చైత్ర వర్షిని తెలియజేశారు ఈ అంశాలను ఎవరైనా పాటించని యెడల వారిపై తగు చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు.