
తిరుపతి: తిరుపతి వెస్ట్ డి.ఎస్.పి నర్సప్ప కథనం ప్రకారం తిరుపతి ఎల్బీనగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ డిసెంబర్ 31 నా బైక్ పై ఇంటి నుంచి బయల్దేరాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుమారుడు రూపేష్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ ఏ పీ టూరిజం శాఖలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆయన బైకు జనవరి ఒకటో తేదీ సాయంత్రం రాయల్ నగర్ లో లభ్యమైంది, ఆచూకీని ఫోన్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ చంద్రశేఖర్ ఆచూకీ లభ్యం కాలేదు. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ముగ్గురు అనుమానితులను పై దర్యాప్తు చేయగా తిరుచానూరు కృష్ణ శాస్త్రి నగర్ కు చెందిన రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. రాజు చంద్రశేఖర్ కు ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడు దానికి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారనే కోపంతో ఉన్నాడని విచారణలో తేలింది. మిగిలిన ఇద్దరు పెద్దకాపు లేఅవుట్ లో వ్యాపారం చేసే మధుబాబు అసలు వడ్డీ న 14.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది, ఇంకొకరు చంద్రగిరి వాసి పురుషోత్తం కూడా చెల్లించాలి ఈ క్రమంలో చంద్రశేఖర్ పై కక్షగట్టిన రాజు మధు బాబు ఇద్దరూ పురుషోత్తం ని కలుపుకుని డిసెంబర్ 31వ తేదీ పెద్దకాపు లేఅవుట్ కు రావాలని డబ్బులు ఇస్తామని ఫోన్ చేశారు. చంద్రశేఖర అక్కడికి వెళ్ళగానే ఇనుప రాడ్ తో తలపై గట్టిగా కొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తం రాకుండా ప్లాస్టిక్ తో చుట్టి అట్టపెట్టెలో పెట్టి భాకరాపేట ఘాట్ దగ్గర అడవిలో పడవేశారు. మంగళవారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మధు బాబు, పురుషోత్తం ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన తో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.