
మంత్రాలయం : ఎవరింట్లో పాము కనిపించినా ఆ వ్యక్తిని పిలుస్తారు. అలాంటి వ్యక్తిని పాము కాటేసింది. చనిపోయింది అనుకొని దానిని చేతిలో పట్టుకుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కాటేసింది ఫలితంగా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన మంత్రాలయం మండలం మాలపల్లి లో శుక్రవారం జరిగింది. గ్రామంలోని పాఠశాల వద్ద పాము కనిపించడంతో భయంతో వెంటనే రంగస్వామి నీ పిలిచారు అతను అక్కడికి చేరుకుని ఆ పాము చనిపోయిందని చేతితో పట్టుకొని చూస్తుండగా కరిచింది వెంటనే స్థానికులు అతన్ని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.