
మదనపల్లె: మదనపల్లె మండలం లోని వలస పల్లెలో సంక్రాంతి సందర్భంగా ఆదివారం కనుమ పండగ కావడంతో ఇందులో భాగంగా పూరి పొలిమేరలలోని గ్రామ దేవతకు బలి ఇచ్చే దాని కొరకై ఒక పొట్టేలును సిద్ధం చేశారు. ఆ పొట్టేళ్లను తలారి సురేష్ (35) పట్టుకుని ఉన్నాడు . మరో తలారి కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలు నరక పోయి సురేష్ తల నరికేశాడు. రక్తస్రావం అధికంగా రావడంతో సురేష్ ను మదనపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛయలు అలుముకున్నాయి.