
దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలలుగా కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు తెలిసిందే. అయితే తాజాగా ఆ రికార్డును మరో వ్యక్తి బద్దలు కొట్టాడు. బ్రిటన్లో లో అటువంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మామూలుగా కరోనా వైరస్ బారినపడిన వ్యక్తులు నాలుగు వారాల లోపే కోలుకుంటారు. కానీ ఈ వ్యక్తినీ ఏకంగా పది నెలలు ఆ లక్షణాలు పోలేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఆయన దాదాపు ఐదుసార్లు మృత్యువు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు కూడా ఏర్పాట్లు చేశారు చివరకు కోవిడ్ కోరల నుంచి 310 రోజుల తర్వాత బయట పడ్డారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలంపాటు కరోనా వైరస్ తో పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు డేవ్ స్మిత్ 72. స్మిత్ కు హైపర్ సెన్సిటివిటీ నిమోనైటీస్ అనే వ్యాధి సమస్య కూడా ఉంది దీనివల్ల ఊపిరితిత్తుల కణజాలం బాగా ఇబ్బందికరంగా ఉంది దీనికితోడు ఆయన క్యాన్సర్ పేషెంట్ కావడంతో ఇన్ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యం తగ్గిపోయింది. ఈయనకు దాదాపు నలభై మూడు సార్లు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆయనకు 265 ఆరోజున ల్యాబ్ లో తయారుచేసిన నా యాంటీబాడీ లతో కూడిన మెడిసన్ ను ఇచ్చారు. ఈ మెడిసన్ కు బ్రిటన్ ప్రభుత్వం వన్ ఇంకా అనుమతించలేదు అయినా నా మానవతా దృక్పథంతో ఔషధాన్ని ఆయనకు లభించింది ఈ వ్యాక్సిన్ వేసిన 45 రోజులు తర్వాత నీటి వచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో డేవ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి బంధువులకు స్నేహితులకు ఫోన్లు చేసి ఇ చెబుతున్నాడు నేను ఇప్పుడు జీవిస్తున్న ప్రతిరోజూ ఊ నాకు బోనస్ గానే భావిస్తున్నాను అని డేవ్ పేర్కొన్నాడు.