
హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులో కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు జమ్మికుంట రోడ్డు లో నివాసం ఉంటున్న కల్లూరి రమేష్, ప్రియదర్శిని లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ వృత్తి రిత్యా కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రమేష్ కు గతంలో వివాహం కాగా మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉండగా , నిత్యం మద్యం మత్తులో రమేష్ మొదటి భార్యతో నిత్యం గొడవలు జరిగేవి ఆ కారణం చేత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆర్టీసీ అధికారులు రమేష్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గొడవపడి ఇంట్లో ఉన్న కత్తెరతో భార్య ప్రియదర్శని పై విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారి సంతానం లోని చిన్నారి సాయి చందన్ పోలీసులకు జరిగిన ఈ విషయాన్ని వివరించాడు అనంతరం చేసిన రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సిఐ పేర్కొన్నారు.