
చిత్తూరు: ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఈడిగపల్లి సమీపంలో ఉన్న యాతాళ వంకకు చెందిన సురేఖ (31) జీవనోపాధి నిమిత్తం మదనపల్లి లోని మంజునాథ్ కాలనీలో నివసిస్తుంది. స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయా గా పనిచేస్తూ ఉంది. అయితే గతంలో ఒక వ్యక్తి తో పెళ్లి అవ్వగా వారి మధ్యలో గొడవలు జరుగుతుండడంతో విడిపోయి ఒకటే జీవిస్తున్నది. ఈ క్రమంలో కాలనీలో ఉన్నటువంటి ఎల్లప్ప అనే వ్యక్తితో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది వీరికి నలుగురు పిల్లలు కూడా పుట్టారు. సజావుగా సాగుతున్న వీరి జీవితంలో అనుమానం పెనుభూతం లా మారింది. గత కొంత కాలంగా భార్యలో మార్పులు రావడంతో పనికి వెళ్లే చోట అక్రమ సంబంధం ఉందని ఎల్లప్ప తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఈనెల 17న సురేఖ ఆలస్యంగా రావడంతో వీరి మధ్య గొడవ మొదలైంది. ఎల్లప్ప కోపంతో టైలరింగ్ కత్తెర ని తీసుకుని ఒళ్లంతా పొడిచాడు. దీనిని గమనించిన స్థానికులు సురేఖను 108 సహాయంతో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమించిందని తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు అనంతరం మదనపల్లె టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎల్లప్ప నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.