
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర అ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ముగిసిన అనంతరం ఈనెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటుకు పోలీసు వారు అనుమతి ఇవ్వలేదు. దీనిపై హైకోర్టు కు వెళ్ళిన రైతులకు కు ధర్మాసనం ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అదే రోజు బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని రాయలసీమ హక్కుల సాధన సమితి పిటిషన్ దాఖలు చేయగా అదేరోజు ఇవ్వడం కుదరదని కావాలంటే మరుసటిరోజు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ సభను తిరుపతి నగర శివార్లలోని నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి కి సమీపంలోని ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ నిర్వహించు కుంటామని రైతుల తరుపు న్యాయవాది వారి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు అనుమతి ఇస్తే ప్రాంతీయ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు పాదయాత్ర జరుగు సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారంటూ కొన్ని వీడియోలను ఏ ఏ జి న్యాయమూర్తి కి చూపించారు. న్యాయమూర్తి గారు ప్రైవేటు ప్రదేశంలో నిర్వహించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కరోనా, ఒమిక్రన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని అడిషనల్ ఏజీ తెలిపారు. వీరి మాటల్లో తోసిపుచ్చిన హైకోర్టు బహిరంగ సభ నిర్వహించుకోవాలని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు సూచించింది. ఈ సభలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు తెలిపింది ఈ తీర్పుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.