
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం పంచాయతీ పరిధిలోని మామిడి గుడ్డి గ్రామ సమీపంలో ఉన్న బోడి కొండ పైన నా ఈ ఘటన జరిగింది. సోమవారం మామిడి గుడ్డి గ్రామానికి చెందిన గణేష్ కట్టెల కోసం కొండ పైకి వెళ్లి తిరుగుతుండగా అక్కడ జీడి చెట్టు కు వేలాడుతూ ఒక శవం కనిపించింది భయంతో గ్రామంలోకి పరుగులు తీసి ఈ విషయాన్ని స్థానికులకు చెప్పాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్ ఐ సందీప్ కుమార్ ఆర్ మా స్థలానికి చేరుకుని బాడీను దించి క్లూస్ టీమ్ ద్వారా ఆ చుట్టు పక్కల ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు అయితే ఆ శవం వేలాడుతున్న చెట్టు దగ్గర నాటు సారా సీసా దొరికింది.
అక్కడ దొరికిన ఆధారాలు తో పాటు ఉ ఇటీవలికాలంలో మిస్సింగ్ కేసులను పరిశీలించగా మెళియాపుట్టి మండలం కోసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు నెల రోజుల క్రితం అదృశ్యం అయినట్లు గుర్తించారు. అయితే శవం అతని దా కాదా అని నిర్ధారించడానికి ధర్మారావు బావమరిది మల్లేష్ ను పిలిపించారు అతను ఆ బాడీ ని గుర్తించి ఇది ధర్మారావు శరీరంగా గుర్తించాడు. ధర్మారావు కుమారులు గత నెల 19న తండ్రి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం డాక్టర్లు ఘటనా స్థలంలో పూర్తి చేసి ఆ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇది హత్య లేక ఆత్మహత్య అనేది విచారణ చేస్తున్నారు. ధర్మారావు కుటుంబంలో గొడవలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం అదృశ్యమైన ధర్మారావు చనిపోయి శవంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.