
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది. హిజ్రాలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ఆదేశించాలని సంగమ స్వయం సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎస్ ఒకా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విజయ్ కుమార్ పాటిల్ సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం పోస్టులను హిజ్రాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు కర్ణాటక పౌర సేవా నియామక చట్టం 1977 సెక్షన్ 9నీ సవరించినట్లు తెలిపారు ఈ విషయమై ఇప్పటికే 2 నోటిఫికేషన్లను కూడా విడుదల చేసినట్లు తెలిపారు .ఈ నోటిఫికేషన్ లపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తరువాత విచారణ కోర్టు ఈనెల 20వ తేదీ కు వాయిదా వేసింది.