
ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు ఫేస్బుక్ సువార్త చెప్పింది. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయాలంటే కచ్చితంగా ఆండ్రాయిడ్ లేదా ios మొబైల్లో మాత్రమే అప్లోడ్ చేసే వీలుండేది . అయితే డెస్కుటాప్ బ్రౌజర్ నుండి ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం ఉండేది కాదు. రాబోయే రోజుల్లో లో డెస్కుటాప్ బ్రౌజర్ లో నుండి కూడా ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం తీసుకురానున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్లో ఉందని తెలియజేసింది. అతి త్వరలోనే ఇన్స్టగ్రామ్ కు ఈ విధమైన ఫీచర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలియజేసింది.