
ఉత్తరాఖండ్: చిన్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్ కు చెందిన సచిన్ అనే యువకుడు తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ కేసు విచారణ జరిపిన కోర్టు సచిన్ పాటు మిగిలిన ముగ్గురు కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలని అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తల్లి అవ్వాలని దానికోసమే నా భర్తకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఇది భార్యగా తన హక్కు అని తన పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది అయితే ఎన్నడూ ఊహించని ఇలాంటి పిటిషన్ను ఉత్తరాఖండ్ హైకోర్టు కు అనేక ధర్మ సందేహాలు కలిగాయి. దీంతో తమకు సలహా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అత్యాచారం కేసులో దోషిగా నిరూపణ జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి వెళ్లి వచ్చా ఇవ్వకూడదా అనేదానిపై చర్చ జరుగుతుంది.
ఒకవేళ అ ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి బిడ్డలుగా మా హక్కు అనే అవకాశం ఉంది కదా అని హైకోర్టు అభిప్రాయపడింది.
పైగా తండ్రి లేని బిడ్డలను తల్లి ఒకటే పోషించడం చాలా కష్టమైన విషయం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను కనడం కోసమే నిందితుడు కి బెయిలు ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తుంది. అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సరిగా తెలియడం లేదని పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులు ఏమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయి అని ఎంక్వయిరీ చేసి వాటి తాలూకు వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.