
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో నీటి నుంచి పూజలు ప్రసాదాల ధరలు పెరుగుతున్నాయని ఆలయ ఈఓ గీత ఉత్తర్వులు జారీ చేశారు.
ఈఓ గీత గారు తెలియజేసిన వివరాలు గత ఆరు సంవత్సరాల కాలంగా గా పూజలు ప్రసాదాలు ధరలు పెంచలేదని కోవిడ్ కారణంగా ఆలయ ఆదాయం తగ్గిందని తెలిపారు. దీంతో జీతాలు ఆర్ధిక భారం గా పెరిగిన దృష్ట్య స్వామి వారి సేవల ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు, ఈ ఆలయ అనుబంధ ఆలయాల్లోనూ ఈ దరలు వర్తిస్తాయని ఆమె తెలియజేశారు. ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్న ఈ నేపథ్యంలో ప్రముఖుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున వివిఐపిలు సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకునే ఎందుకు అవకాశం కల్పిస్తూ 1500 రూపాయలు గా నిర్ణయించారు ఈ టికెట్ గతంలో లేదు. లక్ష్మీనరసింహ నిత్య కళ్యాణం టికెట్ ధర 1250 రూపాయల నుంచి 1500 కు పెరిగింది, నిజా భిషేకం కి 500 నుంచి 800 వందల రూపాయలకు, సుదర్శన హోమం 1116 నుంచి 1250 రూపాయల కి, సత్యనారాయణ వ్రతం సామగ్రి తో కలిపి 500 నుంచి 800 కు, స్వామి వారి అష్టోత్తరం టికెట్ 100 నుంచి 200 కు , సువర్ణ పుష్పార్చన 516 నుంచి 600 రూపాయలు గా, వేద ఆశీర్వచనం 516 నుంచి 600, ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ 750 నుంచి 1000 రూపాయలు గా, అలాగే 100 గ్రాములు లడ్డూ ధర 20 నుంచి 30 రూపాయలు గా, 250 గ్రాముల పులిహోర ప్యాకెట్ ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలు గా, 500 గ్రాముల లడ్డూ ధర 100 నుంచి 150 రూపాయలు, 250 గ్రాములు కూడా 15 రూపాయల నుంచి 20 రూపాయలు గా పెరిగాయని తెలిపారు ఈ పెరిగిన ధరలను భక్తులు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాలని ఈ ఓ గీత విన్నవించారు