
విజయవాడ: ఈ ఐదు మంది తొమ్మిది నెలలో ఆరుగురిని హత్య చేసి వాటి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వాళ్ళు చంపిన వారి అంత్యక్రియలలో మరో 12 మందిని హత్య చేయడానికి సిద్ధం చేశారు ఇంతలోనే వీరిని విజయవాడ నగర పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ కమిషనర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వీరిని వెల్లడించారు ఈ దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేష్ హెడ్ కానిస్టేబుల్ రెహమాన్ రమణ లకు రివార్డులు అందజేశారు.
వివరాలు విజయవాడ శివారు ప్రాంతంలోని ఓ ఎటిఎం లో ఈనెల 12వ తేదీన దొంగతనం జరిగింది దర్యాప్తులో భాగంగా పెనమలూరు పోలీసులు సీసీ కెమెరాలు లోని దృశ్యాలను చూసి ముఖానికి కవర్లు కట్టుకొని దొంగతనం చేసిన వ్యక్తులు కనిపించారు. పోలీసుల ఎంక్వైరీ లో భాగంగా తాడిగడప కు చెందిన ఆటో డ్రైవర్ చక్రవర్తిని విచారించగా చోరీ యత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతను చెప్పిన సమాచారంతో మిగిలిన నలుగురిని పట్టుకున్నారు . వీళ్ళ వేలిముద్రలను పరీక్షించగా కృష్ణాజిల్లా కంచికచర్లలో పోయిన సంవత్సరం డిసెంబర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో దొరికిన వేలిముద్రలతో సరిపోయాయి. మొదట హత్యల గురించి మాకు ఏమి తెలియదని బుకాయించిన చివరకు మీరు చేసిన మొత్తం హత్యల గురించి వెల్లడించారు. వీళ్లు చెప్పిన వివరాలను బట్టి వృద్ధులు ఒంటరిగా ఉండే వ్యక్తులే వీళ్ల లక్ష్యం. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ఈ ప్రాంతాలకు చెందిన ప్రభు కుమార్, గోపి రాజు, చక్రవర్తి అలియాస్ చక్రి, నాగ దుర్గారావు అలియాస్ చంటి ఆటో డ్రైవర్ గా పని చేస్తుంటారు. ఫణీంద్ర కుమార్ పెయింటింగ్ పని చేస్తుంటాడు చెడు అలవాట్లకు బానిసైన వీరు ముఠాగా ఏర్పడి పగటిపూట ఆటో నడుపుతూ రెక్కి నిర్వహించేవారు తరువాత హత్యలకు పాల్పడేవారు.
2020 అక్టోబర్ లో పోరంకి విష్ణుపురం కాలనీ లో ఒంటరిగా ఉంటున్న నలిని 58 అనే మహిళను హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి వీళ్ళ పేర్లు బయటికి రాకపోవడంతో మరిన్ని హత్యలకు తెగించారు.
రెండోసారి 2020 నవంబర్ లో పోరంకి లోని తూముల సెంటర్ లో ఉండే సీతా మహాలక్ష్మి 63 సంవత్సరాలు చంపారు.
మూడోసారి 2020 డిసెంబర్ లో కంచికచర్ల లోని నాగేశ్వరరావు 80 ప్రమీల రాణి 75 ఈ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిని హత్య చేశారు.
ఈ సంవత్సరం జనవరిలో తాడిగడప లో కట్టపై ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మి 58 సంవత్సరాలు తర్వాత ఈ నెలలో పోరంకి లోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న పాపమ్మ 80 సంవత్సరాల ను అతి కిరాతకంగా చంపి వారి నగలను తీసుకొని పారిపోయారు. అయితే వీరు చంపిన ప్రతి ఒక్కరు ఇంటి చుట్టూర తిరుగుతూ పోలీసులు చేసే ఎంక్వయిరీ ఇరుగుపొరుగు మాట్లాడుకునే విషయాలను కనుక్కుంటూ ఉండేవారు అయితే ఆ చనిపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయి స్మశానానికి వెళ్లే వరకు అక్కడే ఉంటారు అవసరమైతే వారి అంత్యక్రియలకు సాయం చేసేవారు.