
మెదక్ జిల్లా: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కల్పగూరు శివారు గంజి గూడెం చెందిన వెంకట్ (45), లక్ష్మయ్య (55) ఇద్దరూ కలిసి మద్యంలో గడ్డి మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే వీరిద్దరూ సంగారెడ్డిలోని జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం రాత్రి సైకిల్ దొంగతనం చేసి దాన్ని గ్రామంలో దాచిపెట్టారు. అదే రోజు గ్రామానికి చెందిన కృష్ణయ్య బైక్ను పంటకాలంలో వేశారు. ఆరోజు రాత్రి అదే గ్రామంలో కట్టేసిన బర్రెల తాళ్లు విప్పుతుండగా వాటి యజమాని మల్లేశం గమనించి అరవడంతో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఆ నిందితులను వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తిట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేయుటకు రాలేదు. వీరిద్దరూ భయంతో ఊరి చివరన కల్లు తాగి అక్కడి నుండి సంగారెడ్డి వెళ్లి గడ్డి ముందు తో మద్యం కలిపి సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.