
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్కు చెందిన నటి రైమా ఇస్లాం షిము 1998లో భర్తమాన్ సినిమా తో తన కెరీర్ను స్టార్ట్ చేసి సుమారు 25 సినిమాలు నటించింది. ఆమె టీవీ సీరియల్ లోను నటించి మరియు కొన్నింటిని నిర్మించింది కూడా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల 16వ తేదీన ఆమె భర్త షేకవత్ అలీ నోబెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే బంగ్లాదేశ్ రాజధాని దాకా లోని కెరాని గంజ్ లోని ఒక బ్రిడ్జి వద్ద ఒక గోనెసంచి కనిపించడంతో అనుమానంతో అక్కడి ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ సంచిని తెరువగా రైమా మృతదేహం కనిపించింది. ఆ మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానంతో భర్తను అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కాగా ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.