
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వీధుల్లో 39 వ రోజు పాదయాత్ర జోరువానలో కూడా కొనసాగింది. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు శాంతిభద్రతల కు విఘాతం అంటూ చేసిన హెచ్చరికలను సవాల్ చేస్తూ వివిధ ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు, కుల సంఘాలు, తో పాటు అన్ని రాజకీయ వర్షాలు పెద్ద ఎత్తున రాజధాని రైతుల మహా పాదయాత్ర కు తరలించారు. ఈ పాదయాత్రలో తెలుగుదేశంతో పాటు ఉ జనసేన, భాజపా, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ముందుండి పాదయాత్రను నడిపించాయి. ఈ పాదయాత్రకు సాటి తెలుగు వారు ఆవేదన చూసిన కర్ణాటక నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు అయినా యలమంచిలి వెంకటవాసుదేవరావు దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల పాదయాత్రకు 60 లక్షల విరాళం అందజేశారు రైతులు పడుతున్న కష్టాలు చూసి గుండె తరుక్కు పోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.