
ఖమ్మం: ఖమ్మం ఎక్సైజ్ సర్కిల్లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం. చిరంజీవి 55 బ్లాక్ ఫంగస్ కారణంగా ఆదివారం మృతి చెందాడు. నేలకొండపల్లి ఎక్సైజ్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న చిరంజీవి గారికి కరోనా సోకింది. చికిత్సకోసం హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత బ్లాక్ ఫంగస్ సోకింది. తిరిగి అదే హాస్పిటల్లో కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. రికవరీ అవుతున్న సందర్భంలో మళ్లీ అనారోగ్యం బారిన పడి ఆదివారం మరణించారు. చిరంజీవి గారికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.