
2008వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటప్ప నాయుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురు ఆదివారం విడుదలయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకటప్ప వెంకటప్ప నాయుడు ని 2008 ఇది మే 17న అతను ప్రత్యర్థులు వెంకటప్ప నాయుడు వెళుతున్న జీబు ను లారీ తో గుద్ది బాంబులు వేసి వేట కొడవలితో నరికి చంపినవారు ఈ ఆదివారం విడుదలయ్యారు. ఈ ఘటనలో నాయుడుతో పాటు అతని అనుచరులు ఎనిమిది మందిని కూడా ఘటనా స్థలంలో దారుణంగా హత మార్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు, వారం పద్మక్క తో పాటు 48 మందిపై కేసు నమోదు చేశారు. ఆదోని న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరిగి 2014 డిసెంబర్ 8న 21 మంది ఇది నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ విచారణ జరుగుతున్న సమయంలో నిందితుల్లో నలుగురు మృతి చెందగా శిక్ష ఖరారు అయిన తర్వాత మరో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారు కడప జైలు లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఆదివారం ఈ కేసులో ప్రధాన వ్యక్తి అయినా మద్దిలేటి నాయుడుతో పాటు మరో నలుగురు విడుదలయ్యారు. బెయిల్ రాకుండా ఐదేళ్ళపాటు మగ్గిపోతున్న ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కరోనా నేపథ్యంలో జైలులో ఖైదీల సంఖ్య తగ్గించాలనే ఆలోచనతో ఐదేళ్లపాటు బెయిల్ రాకుండా ఉన్న వారందరినీ బెయిల్పై విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఐదుగురు కూడా విడుదలయ్యారు. అయితే ఆదివారం దేవర బండ గ్రామంలో జరిగిన జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి జయరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, కాగా ఆయనతో కలిసి ఈ ముద్దాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.