
తిరుపతి: తిరుపతికి సమీపంలోని రామచంద్రపురం మండలంలోని రాయలచెరువు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు దండోరా వేయించారు. ఆర్ డి ఓ రేణుక ఈ చెరువును పరిశీలించారు. ఈ చెరువు క్రింది ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద చెరువులలో ఇది ఒక చెరువు. ఈ చెరువు తెగితే వందలాది గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని తెలియజేశారు. ఈ చెరువు ఆయకట్టు కింద వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం భారీగా పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఈ కట్ట బలహీనపడడంతో ఏ క్షణంలోనైనా నా తగ్గి పోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు ముందస్తుగా ఆయా గ్రామాలలో ఇస్తున్న ప్రజలకు వారి విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకుని అప్రమత్తంగా ఉండాలని దండోరా వేస్తున్నారు.