
భువనేశ్వర్: రోజు రోజుకి ఉదృతం అవుతున్న కరోనా గురువారం పదివేల కు పైగా కేసులు మూడు మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే అత్యధిక కేసులు రావడం ఇదే మొదటిసారి. మొత్తం 10059 కేసులు కాగా వారిలో 872 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 44349 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా అధికారులు బులెటిన్లో పేర్కొన్నారు.