
హైదరాబాద్: టోలి చౌకి పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి, వైద్యఆరోగ్యశాఖ వారు ఓమిక్రాన్ వైరస్ బారినపడిన వారి ఇంటి నుంచి 25 ఇళ్ల పరిధినీ కంటోన్మెంట్ జోన్ కింద కరోనా ఆంక్షలు విధించారు. ఈ ఇరువురు ఈనెల 12వ తేదీన ఒకరు కెన్యా నుంచి, మరొకరు సోమాలియా దేశాలనుంచి వచ్చినట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జిహెచ్ఎంసి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య వచ్చినా సత్వరమే అధికారులకు తెలియజేయాలని కోరారు.