
జులై 1 నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ సిస్టం ను ఉపయోగించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ అ వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. జులై 1 అనగా రేపటి నుంచి గ్రామ అ వార్డు సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని దాని ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగులందరూ కార్యాలయానికి వచ్చినప్పుడు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మెట్రిక్ సిస్టమ్ ను ఉపయోగించాలని సూచించారు. అలాగే కే.ఏ సెలవులకు ఇకనుంచి హెఆర్ఎంఎస్ లోనే దరఖాస్తు చేసుకోవాలని అని స్పష్టం చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి ప్రజల వినతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డ్యూటీ లో భాగంగా మీటింగులకు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా రాయాలని సూచించారు అయితే రేపటి నుంచి ఈ బయోమెట్రిక్ సిస్టం ను అమలయ్యేలా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్ లకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.