
ఖమ్మం అర్బన్: ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పాఠశాలలో బానోతు కిషోర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయ రాలే కావున వీరిరువురు ఖమ్మం లో నివాసం ఉండేవారు. ప్రతి రోజు పాఠశాలకు ఇద్దరూ కలిసి వెళ్లి వస్తూ ఉండేవారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మం లో నివాసముండే ఒక ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్ డోర్నకల్ వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి స్కూటర్పై పై పాఠశాలకు వెళ్లి వస్తుండేది. 17వ తేదీన ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషన్ సమీపంలో వేచి ఉన్న మహిళా ఉపాధ్యాయురాలి నీ నమ్మించి కారు ఎక్కించుకున్నాడు. తరువాత ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కుని చంపుతానని బెదిరించి మార్గమధ్యంలో పాండురంగాపురం లోని ఒక ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని చెబితే ఆమె భర్తను పిల్లలను చంపుతానని బెదిరించాడు. భయపడిన ఉపాధ్యాయురాలు తీవ్రంగా బాధపడి మంగళవారం తన భర్తకు విషయం చెప్పడంతో వారిరువురు కలిసి సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందాల ద్వారా వెతికి ఇస్తున్నామని సి ఐ తెలిపారు.