
హైదరాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లి మండలం వెదిలిపత గుట్ట తండాకు చెందిన సాంబావత్ సరోజ (30), మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల కు చెందిన జరుప్లావత్ శ్రీను (21) అక్క తమ్ముళ్ళు. సరోజ భర్త చనిపోవడంతో తమ్ముడు తో పాటు టైల్స్ పని చేసుకుంటూ మీర్ పేట కార్పొరేషన్ పరిధిలో జిల్లెలగూడ సత్య సాయి నగర్ కాలనీలో ఉంటుంది. వీరి అక్క లక్ష్మి కి ఉప్పుగూడ వినాయక్ నగర్ కు చెందిన కొడావత్ రెడ్యా (45) వివాహం జరిగింది అతనికి ఇది రెండో వివాహం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అతను కూడా టైల్స్ పని చేసుకుంటూ ఉంటాడు. రెడ్యా కొంతకాలంగా సరోజ తో దగ్గరగా ఉంటున్నాడు ఈ క్రమంలో తరచు మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు ఈ విషయాన్ని తమ్ముడు శీను చెప్పుకుని బాధపడింది ఈనెల రెండో తేదీన రాత్రి 11:00 సమయంలో తాగి సరోజ ఇంటికి వెళ్లి గొడవ చేస్తున్న రెడ్యా ను చపాతీలు చేసుకునే పరికరంతో అతని తలపై గట్టిగా కొట్టారు దీంతో రెడ్యా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు . ఆ రోజు అతనునీ అక్కడే ఉంచి తర్వాత రోజు ఉదయం హస్తినాపురం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు శీను సరోజ. చికిత్స జరుగుతూ రెడ్యా చనిపోయాడు లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుతో సరోజా శ్రీను ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.