
సుమారు 387 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారు. ఈ ఫ్లై ఓవర్ ని మంగళవారం మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ 2017 ఆగస్టు 21న శంకుస్థాపన చేశారు ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది.
బాలానగర్ డివిజన్లో నర్సాపూర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి (కూకట్ పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి). ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. బాలానగర్ ట్రాఫిక్ దాటితే చాలని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. రేపటితో ఈ కష్టాలు పూర్తి పరిష్కారం అవుతుంది. ఈ బ్రిడ్జి కి ఇరువైపులా రెండు డివిజన్లలో 1 ఫతేనగర్ రెండోది బాలనగర్. ఈ డివిజన్లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. ఈ బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్ల వెడల్పు 26 పిల్లర్ల తో నిర్మించారు. దీనికి కి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిడ్జి గా నామకరణం చేయనున్నారు.