
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం వివిధ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తనిఖీల్లో పాల్గొన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి Ts 10 ER 7069 ఈ నెంబర్ గల వాహనం హోండా డియో. ఈ స్కూటీ పై 130 పెండింగ్ చలానా లు ఉన్నట్లు గుర్తించారు. గత మూడేళ్లుగా ఈ స్కూల్ యజమాని విజయ్ ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు అయితే మొత్తం ఈ 130 చలనాలకు గాను 35,950 రూపాయలు కట్టాలని పోలీసులు అతనిని అడుగగా నేను కట్టను అని అతను చెప్పడంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.