
అందరూ టీకాలు తీసుకోవాలన్న కేంద్రమంత్రి నఖ్వీ.
ఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటo లో వ్యాక్సిన్ పై ఆలోచిస్తే కారణాలు దగ్గరకు తెచ్చుకున్నట్టే అని నీ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. సోమవారం ఆయన ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో లో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మన రాంపూర్ లోని చమర్ పీహెచ్సీలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు వాళ్ల సొంత ప్రయోజనాల తో ఒ వ్యాక్సిన్ లపై భయాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు దేశ ప్రజల ఆరోగ్యం శ్రేయస్సుకు పూర్తి వ్యతిరేకులుగా పేర్కొన్నారు.
జరగబోయే రోజుల్లో సామాజిక విద్య సంస్థలు ఎన్జీవోలు స్వయం సహాయక సంఘాలతో కలిసి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
మన శాస్త్రవేత్తలు కష్టపడి దేశంలో ఉత్పత్తి చేసిన రెండు వ్యాక్సిన్లు పూర్తిగా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని కరోనా రహిత భారత్ సాధనలో భాగస్వాములు కావాలని కోరుకున్నారు.