
ఎంపీ రఘురామ రాజు వ్యవహారం వైసీపీకి తలవంపులు గా మారింది. ఇప్పటికే జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన ఆయన తాజాగా తోటి ఎంపీ అయిన విజయ్ సాయి రెడ్డి ని టార్గెట్ చేశారు. బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బెయిల్ రద్దు పిటిషన్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 25న జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తూర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బెయిల్ రద్దు అవుతుందా లేక కొనసాగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదే సమయంలో RRR మరో బాంబు పేల్చారు. ఈ పిటిషన్లో విజయ్ సాయి రెడ్డి ఇ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని రెండు రోజుల్లో ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ CM పదవిని అడ్డుపెట్టుకుని కేసులను ను నీరు కారుస్తూ సిబిఐ అధికారులను సాక్ష్యాలను ప్రలోభాలకు గురి చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లి లోని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏదో ఒక కేసు పేరుతో అరెస్టు చేసిన కోర్టును ఆశ్రయీస్తూ ఉన్నాడు. అటు ఎంపీ పదవిపై పై వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఆ వ్యవహారం ముందుకు కదలడం లేదు దీంతో వైసీపీ నేతలు ఆయన పేరు చెప్పినా మండిపడుతున్నారు.