ముంబై పనిమనిషిగా చేరుతుంది పది రోజులు బాగానే ఉంటుంది ఆ తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొరికినంత దోచుకుని పరార్ అవుతుంది ఇలా ఒక్కసారి కాదు పదుల సార్లు దొంగతనాలకు పాల్పడింది ఏకంగా 50 సార్లు అరెస్టయింది అయినా కూడా ఆ మహిళ తన అలవాటు మార్చుకోవడం లేదు తాజాగా మరోసారి దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది.
ఆమె వివరాలు ముంబైకి చెందిన వినిత గైక్వాడ్ 38 సంవత్సరాలు అనే మహిళ ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటుంది పది రోజుల క్రితం ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో పని కుదిరింది ఈ క్రమంలో ఆమె ఇంట్లో నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులతో పరారైంది ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలు ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వనిత చేతి వాటాన్ని గుర్తించారు ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు ప్రతిసారి ఇ పేర్లు మార్చుకుని ఇలా చేస్తుందని పోలీసులు తెలిపారు.