
కమలాపూర్: వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలిసి మూడురోజులు కష్టపడి ఈ దందాను చేధించారు. జిల్లా అదనపు డీఎంహెచ్వో డాక్టర్ మదన్మోహన్ తెలియజేసిన వివరాలు సమ్మయ్య అనే ఆర్ఎంపీ డాక్టర్ మహిళలకు వైద్య పరీక్షలు చేయడం సంతానం కల్పిస్తామని చెబుతూ తగిన సూచనలు అర్హతలు లేకుండా చేస్తున్నారు. ఈ క్లినిక్ లో గైనకాలజీ వైద్యులు ఉన్నట్లు బోర్డులు పెట్టినా వారు రావడం లేదు. ఈ క్లినిక్ లో ఇంట్రా వైజినల్ ఇంజక్షన్ వేస్తున్నట్లు కనుగొన్న మన్నారు. ఆర్ఎంపీ సమ్మయ్య ల్యాబ్ టెక్నీషియన్ గాదె ధనుంజయ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇద్దరిని శుక్రవారం రాత్రి కమిషనరేట్లో సిపి తరుణ్ జోషి ముందు హాజరు పరిచారు.