
అమరావతి: భారత వాతావరణ విభాగం సూచన మేరకు దక్షిణ కోస్తాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 29వ తేదీన అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని దీని ప్రభావంతో నేటి నుంచి 30వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది.