
రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని షాద్నగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి (28) హైదరాబాదులో నివాసం ఉండి HDFC బ్యాంకులో చిన్న ఉద్యోగిగా, మరియు జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంత ఊరికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగి ప్రయాణం అయింది అయితే రైలు షాద్ నగర్ లో ఆగింది కానీ ఆమె కాచిగూడ చేరుకుందని భావించిన జ్యోతి ట్రైన్ చూడగా తను షాద్నగర్ లో ఉన్నా అని తెలియడంతో తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంలో అదుపు తప్పి కింద పడిపోయింది . ఆమె పడిపోవడం ఎవరూ గమనించలేదు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్లోని గార్డ్ జ్యోతి ని గమనించి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.