
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జువెలరీ సంస్థలు గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌ను అనుసరించకపోయినా కూడా ఆగస్ట్ వరకు ఎలాంటి పెనాల్టీలు పడవని తెలిపింది. అయితే కస్టమర్లు ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని పేర్కొంది.
ప్రధానాంశాలు:
గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి
ఫాలో కాకపోయినా నో పెనాల్టీ
ఎంత వరకంటే..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం విక్రయించే వారికి, కొనుగోలు చేసే వారికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. దేశంలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జువెలరీ సంస్థలు హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలి.
ఒకవేళ గోల్డ్ హాల్ మార్క్ లేని నగలను విక్రయిస్తే.. భారీ జరిమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మోదీ సర్కార్ ఇప్పుడు జువెలరీ సంస్థలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఆగస్ట్ వరకు ఎలాంటి పెనాల్టీ ఉండదని తెలిపింది. హాల్ మార్క్ నిబంధనలను అనుసరించకపోయినా కూడా జరిమానాలు ఉండవని పేర్కొంది.
అయితే వినియోగదారులు ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీఐఎస్ కేర్ యాప్ లేదా వినియోగదారుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఫిర్యాదులు వస్తే మాత్ర చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
బంగారు ఆభరణాలకు గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం 2019లోనే ప్రకటించింది. 2021 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అయితే ఈ డెడ్‌లైన్‌ను మోదీ సర్కార్ జూన్ 15 నాటికి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ రూల్స్ 256 జిల్లాల్లో అమలులోకి వచ్చాయి.