
ఉత్తర ప్రదేశ్: పోలీసులు వివిధ రకాల అక్రమ రవాణా మరియు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేసిన ఆ బాటిళ్లను గోడౌన్ లో నిల్వ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోడౌన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేసిన ఉన్నతాధికారులు మహిళా హెడ్ కానిస్టేబుల్ ను నిందితురాలిగా పరిగణించారు. కైరాన ఎస్పీ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ తారేశ్ శర్మపై సెక్షన్ 409 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మద్యం బాటిల్స్ మిస్సింగ్ విషయంలో తారేశ్ శర్మ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందని ఆమె నివాసంలో పోయిన 578 కార్టూన్ లా మద్యంలో కొన్ని కేసులు ఆమె ఇంటిలో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సింగ్ చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగు చూసిందని తెలిపారు.