
హుబ్లీ (కర్ణాటక) ; కిమ్స్ ఆసుపత్రిలో కాన్పు కొరకు ఆదివారం మధ్యాహ్నం ఓ మహిళ పురిటి నొప్పులతో చేరింది. ఆ మహిళకు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు అయితే శిశువు ఉచిత ఆకారంలో ఉండటం చూసి వైద్యులు ఖంగు తిన్నారు.
ఆ శిశువుకు ఒక కాలు మాత్రమే ఉంది, మిగిలిన కాలికి సంబంధించిన ఎటువంటి భాగాలు లేవు దీంతో ఆ ప్రాంతమంతా వింత గా మారింది. ఆ శిశువును చూడడానికి ఆసుపత్రికి చాలామంది చేరుకున్నారు అయితే ఇలా జన్మించడానికి కొన్ని జన్యు పరమైన లోపాల వల్ల ఇలా పుడతారని డాక్టర్లు తెలియజేశారు.