
నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామంలోని ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు గురించి అందరికీ తెలిసిందే అయితే ఐ డ్రాప్స్ పై ఏపీ హైకోర్టు లో వాదోపవాదనలు జరిగాయి. ఆనందయ్య ఐ డ్రాప్స్ లో హానికర పదార్థం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. ఈ ఐ డ్రాప్స్ ఐదు ల్యాబ్ లో పరీక్షించమని మందులు ఒక హానికరమైన నా పదార్థం ఉందని పరీక్షల్లో తేలింది అని చెప్పారు. ఐ డ్రాప్స్ శాంపిళ్లను 5 ల్యాబ్ కు పంపగా ఎల్.వి.ప్రసాద్ ఇన్స్టిట్యూట్ శంకర నేత్రాలయ ఈ రెండు డ్రాప్స్ లో హానికర పదార్థం ఉందని నివేదిక ఇచ్చాయని . ప్రభుత్వం తరపు ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదించారు.
ఆనందయ్య తరపు న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ మాత్రం ఈ ఐ డ్రాప్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవని తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందని కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.