
కడప జిల్లాలో దారుణం జరిగింది. బావని బావమరిది అతిదారుణంగా హతమార్చాడు. తాగుడుకు బానిసైన బావ అక్కని హింసించడం భరించలేక బావమరిది ఘాతుకానికి తెగబడ్డాడు. అక్క భర్తని అమానుషంగా అంతమొందించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది. పట్టణంలోని అమృత నగర్‌కి చెందిన షేక్ ఫయాజ్ మద్యానికి బానిసై నిత్యం భార్యను కొడుతుండేవాడు. గత రాత్రి కూడా బావ తాగొచ్చి అక్కని కొట్టడంతో బావమరిది కరిముల్లా కోపంతో రగిలిపోయాడు. బావ ఫయాజ్ కళ్లలో కారంకొట్టి ఇనుపరాడ్డుతో మోది కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.