
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఈ కార్యక్రమాల్లో భాగంగా 16 మంది మంత్రులకు ఒక్కొక్కరికి రెండు కోట్లు చొప్పున 32 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2021 _ 2022 ఆర్థిక సంవత్సరానికిగానూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి కొరకు ఈ మొత్తాన్ని అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిధులను మంత్రులకు సంబంధించిన జిల్లాలు వాటి పరిధిలోని నియోజకవర్గాలలో చేపట్టే కార్యక్రమాలకు ఈ నిధిని ఉపయోగించాలని సూచించారు.