
హైదరాబాద్: నగరంలో లో అంతర్రాష్ట్ర గంజాయ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి పద్దెనిమిది వందల ఇరవై కిలోల గంజాయి సుమారు దాని విలువ 3 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి నీ విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి సీజ్ చేశారు. ఈ కేసు గురించి మిగిలిన వివరాలు ఈరోజు వెల్లడిస్తామని సి పి మహేష్ భగవత్ తెలిపారు.