
వాషింగ్టన్: జార్జియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రిసమయంలో తన బెడ్ రూంలో పడుకోవడానికి బెడ్ ను సద్దుతుండగా కింద ఏదో చప్పుడు వినిపించడంతో క్రింద చూసింది అయితే ఆమెకు ఒక పాము కనిపించింది ఆ పామును చూసి గట్టిగా కేకలు వేయడంతో ఆమె భర్త రూమ్ లోపలికి వచ్చి ఆ పాము ని పట్టుకుని ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూడగా అక్కడ అ వారికి ఏకంగా 18 పాములు కనిపించాయి. ఈ పాములు అన్నింటిని ఒక సంచిలో బంధించి అడవిలో వదిలారు. స్నేక్ రెస్క్యూ టీం వచ్చిన తర్వాత ఇంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఇల్లంతా గాలించారు అక్కడ ఇంకా ఏమీ లేక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఫోటోలను ఆమె తన ఫేస్బుక్ అకౌంట్లో ప్రచురించింది.