
పాలమూరు : వివిధ తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారం లేకుండా తిరుగుతున్న వాహనాలను పట్టుకుని స్టేషన్కు తరలించి ఉన్నారు. అటువంటి వాహనాలకు పోలీసు వారు మోక్షం కల్పించారు . వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి వాహనాలను జడ్చర్ల లోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించి ఉన్నారు. ఎవరైతే వారి వాహనాలకు సంబంధించిన ఆధారాలు తీసుకువచ్చి తీసుకు వెళ్లవలసిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి అయితే వాటిని వేలానికి ముందు వారి యజమానులకు ఒరిజినల్ ఆర్ సి తీసుకొని డిటిసి కేంద్రానికి వచ్చి తీసుకు వెళ్లాలని చెప్పారు. అయితే నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈ లోపల ఎవరైనా వస్తే వాళ్ళ డాక్యుమెంట్లు చెక్ చేసి ఇస్తాము లేకుంటే వేలం పాట జరుగుతుందని డీఎస్పీ శ్రీధర్ చెప్పారు.