
హైదరాబాద్: దేశంలో కరోనా లాక్ డౌన్లోడ్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాస్ కు లేని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లోని 51 సెక్షన్ కింద సుమారు 13,16,098 కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయల జరిమానా విధించినట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా గత ఏడాది 3,26,758 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 9,89,340 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ మొత్తం కేసులలో ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇది ఎప్పటి వరకు 1,08,736 కేసు నమోదు చేశారు. మళ్లీ ఒమిక్రాన్ నేపథ్యంలో మరోసారి అప్రమత్తమైన పోలీసు వారు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ మాస్కులు లేకుండా దొరికిన వారిపై ఈ పెట్టి కేసు నమోదు చేస్తూ వారి వద్ద ట్యాబ్ ల నుంచి అప్పటికప్పుడు సెల్ ఫోన్ కి మెసేజ్ లు పంపిస్తున్నారు మరియు వీరిని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి హాజర్ పరుస్తున్నారు.